Telangana Govt : గోదావరి పుష్కరాలు - 2027 లోగో డిజైన్ పోటీలు… రూ. లక్ష గెలుచుకునే ఛాన్స్, మీ ఎంట్రీ ఇలా పంపండి

Godavari Pushkaralu 2027 Logo Contest : గోదావరి పుష్కరాలు 2027 కోసం తెలంగాణ ప్రభుత్వం లోగో, ట్యాగ్‌లైన్ పోటీని ప్రకటించింది. నవంబర్ 30లోపు ఉత్తమ డిజైన్లు పంపిన వారికి రూ.1 లక్ష వరకు నగదు బహుమతులు అందిస్తారు.

Published on: Nov 23, 2026, 19:01:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Godavari Pushkaralu 2027 Logo Contest : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు-2027 కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మహా క్రతువుకు సంబంధించిన ప్రచార లోగో (Logo), ట్యాగ్‌లైన్ (Tagline) రూపకల్పన కోసం సృజనాత్మక ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. అత్యుత్తమ డిజైన్లు అందించిన వారికి రూ. 1 లక్ష వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

గోదావరి
గోదావరి

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోటీ వివరాలను వెల్లడించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన కళాకారులు, డిజైనర్లు, విద్యార్థులను కోరారు.

నగదు బహుమతుల వివరాలు…..

ఈ పోటీలో విజేతలుగా నిలిచిన మొదటి మూడు ఉత్తమ డిజైన్లకు ప్రభుత్వం ఆకర్షణీయమైన నగదు పురస్కారాలను ప్రకటించింది.

  • మొదటి బహుమతి: రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయలు)
  • రెండో బహుమతి: రూ. 50,000
  • మూడో బహుమతి: రూ. 25,000

ఎంట్రీలు ఎలా పంపాలి….?

ఆసక్తి గల అభ్యర్థులు తాము రూపొందించిన లోగో, ట్యాగ్‌లైన్ రెండింటినీ కలిపి [email protected] అనే ఈ-మెయిల్ ఐడీకి పంపించాలి. నవంబర్ 30, 2026 సాయంత్రం 5 గంటలలోపు అందిన ఎంట్రీలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. ఈ పోటీలో ఎంపికైన అత్యుత్తమ డిజైన్‌ను గోదావరి పుష్కరాలు-2027 అధికారిక చిహ్నంగా ప్రభుత్వం వినియోగిస్తుంది.

2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి సుమారు 8 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంతటి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కర స్నానాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా 67 కీలక ప్రాంతాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ వేడుకను ప్రపంచ స్థాయిలో చాటిచెప్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.